‘భరత్ అనే నేను’ సక్సెస్ తో రిలీఫ్ అయ్యా – మహేష్ బాబు

Monday,April 23,2018 - 08:28 by Z_CLU

కేవలం 3 రోజుల్లో 100 కోట్ల  గ్రాస్  వసూలు చేసింది ‘భరత్ అనే నేను’. తెలుగు స్టేట్స్ లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా అదే రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. ఈ సందర్భంగా థాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది ‘భరత్ అనే నేను’ టీమ్. ఈ మీట్ లో ఈ సినిమా సక్సెస్ తనకెలాంటి ఫీలింగ్ కలిగించిందో షేర్ చేసుకున్నాడు మహేష్ బాబు.

“ సినిమా సూపర్ హిట్ అని ఫస్ట్ కాల్ నాకు నా వైఫ్ నమ్రత నుండి వచ్చింది. ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఎక్స్ ప్రెస్ చేయలేను కానీ చాలా రిలీఫ్ అనిపించింది. ఇంత అద్భుతమైన సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఇది లైబ్రరీలో పెట్టుకోదగ్గ సినిమా. రేపు నా పిల్లలకు గర్వంగా చూపించుకోదగ్గ సినిమా భరత్ అనే నేను. ఇంత అద్భుతమైన సినిమా నాతో చేసినందుకు కొరటాల శివగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని ఇమోషనల్ గా చెప్పుకున్నాడు భరత్ అనే నేను.

ఈ థాంక్స్ మీట్ లో మహేష్ బాబుతో పాటు దర్శకుడు కొరటాల శివ, కైరా అద్వానీ, దేవి శ్రీ ప్రసాద్, రామ జోగయ్య శాస్త్రి తో పాటు బ్రహ్మాజీ పాల్గొన్నారు. ఈ మీట్ తరవాత  తిరుపతి లో ఏప్రిల్  27  న  మరో  సక్సెస్ మీట్ ని ప్లాన్ చేస్తుంది ‘భరత్ అనే నేను’ టీమ్.