Box Office Review - ఫిబ్రవరి

Tuesday,March 02,2021 - 10:01 by Z_CLU

ఫిబ్రవరిలో అటుఇటుగా 30 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కానీ అందులో క్లిక్ అయినవి చాలా కొన్ని మాత్రమే. సంక్రాంతి సినిమాలు ఇచ్చిన జోష్ ను, వందశాతం ఆక్యుపెన్సీ వెసులుబాటును ఉప్పెన సినిమా మాత్రమే క్యాష్ చేసుకోగలిగింది.

Zombie-Reddy-Release-February-5

ఫిబ్రవరి మొదటివారంలో చాలా సినిమాలు రిలీజయ్యాయి. కానీ జాంబీరెడ్డి మాత్రమే ఉన్నంతలో నిలబడింది. 2 వారాల్లో 15 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా తేజ సజ్జాను ఫుల్ లెంగ్త్ హీరోగా ప్రొజెక్ట్ చేసింది. ఈ సినిమాతో పాటు వచ్చిన అదిరింది దిమ్మ తిరిగింది, ప్రణవం, నాతో ఆట, చేతిలో చెయ్యేసి చెప్పుబావ, జై మరియమ్మ, జర్నలిస్ట్, విఠల్ వాడి, రాధాకృష్ణ, జి-జాంబీ సినిమాలేవీ ఆడలేదు.

uppena-vaishnav-tej-krithi-shetty

ఫిబ్రవరి సెకెండ్ వీక్ లో బాక్సాఫీస్ కు కళ వచ్చింది. ఉప్పెన నిజంగానే తెలుగుతెరపై ఉప్పెనలా మారింది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను హీరోహీరోయిన్లుగా.. బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేసిన ఈ సినిమా ఇప్పటివరకు 70 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. కొత్త నటీనటులు, కొత్త దర్శకుడితో తీసిన ఈ సినిమాకు ఈ రేంజ్ లో వసూళ్లు రావడం పెద్ద రికార్డు. ఈ మూవీతో పాటు వచ్చిన FCUK, వైతురణి రానా లాంటి సినిమాలు ఫెయిలయ్యాయి.

naandhi

మూడో వారంలో నాంది సినిమా మెరిసింది. అల్లరినరేష్ కు దాదాపు 8 ఏళ్ల తర్వాత ఓ సక్సెస్ అందించింది. విజయ్ కనకమేడల డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అండర్ ట్రయల్ ఖైదీగా అల్లరోడి యాక్టింగ్ అందర్నీ కట్టిపడేసింది. విడుదలైన మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ కంటే, 10వ రోజు వచ్చిన వసూళ్లు ఎక్కువ.

kapatadhaari-sumanth

నాందిపై మౌత్ టాక్ ఏ రేంజ్ లో పనిచేసిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నాందితో పాటు అదే వారంలో వచ్చిన కపటధారి, చక్ర, పొగరు సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. ఉన్నంతలో కపటధారి ఫర్వాలేదనిపించుకుంది.

Nithin Check Movie Priya prakash

ఇక ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో వచ్చిన చెక్ సినిమా ఓ మోస్తరు రెస్పాన్స్ మాత్రమే రాబట్టుకుంది. నితిన్, రకుల్, ప్రియాప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ తో నడుస్తోంది. ఈ సినిమాతో పాటు వచ్చిన క్షణక్షణం, ఏప్రిల్ 28 ఏం జరిగింది, బాలమిత్ర లాంటి సినిమాలన్నీ డిజాస్టర్లు అయ్యాయి.

అలా ఫిబ్రవరిలో ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవగా.. నాంది, జాంబీరెడ్డి సినిమాలు హిట్ అనిపించుకున్నాయి. చెక్ సినిమా యావరేజ్ టాక్ తో నడుస్తోంది.