'ఎఫ్‌సీయూకే' ఒక కామిక్ రిలీఫ్ లాంటి సినిమా

Monday,February 08,2021 - 05:15 by Z_CLU

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)‘. రామ్ కార్తీక్‌-అమ్ము అభిరామి యువ జంట‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో బేబి స‌హ‌శ్రిత న‌టించగా విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది.

ఈ సందర్భంగానిర్మాత దామోద‌ర్ ప్రసాద్ (దాము) మాట్లాడుతూ ” సినిమా క‌థ న‌డిచేది నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ల‌తో. అందుక‌ని ‘ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్’ అని పెట్టాం. అది లెంగ్తీగా అనిపిస్తున్న‌ద‌ని భావించి, పొడి అక్ష‌రాల్లో ‘ఎఫీసీయూకే’ అని పిలుస్తున్నాం. జ‌గ‌ప‌తిబాబు గారి ద్వారా సాగ‌ర్ నాకు ప‌రిచ‌య‌మ‌య్యాడు. సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు సింగిల్ క‌ట్ కానీ, బీప్ కానీ లేకుండా ‘ఎ’ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. అలా అని ఈ సినిమాలో న్యూడిటీ కానీ, కిస్ సీన్స్ కానీ ఉండ‌వు. కొన్ని బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి. శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్ అనేది ఎప్పుడూ త‌ల‌దించుకొనే సినిమాలు తియ్య‌దు. ” అన్నారు.

దర్శకుడు విద్యా సాగర్ మాట్లాడుతూ ” ఈ సినిమా ఆద్యంతం కామెడీతో అల‌రిస్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఆడియెన్స్‌కు ఈ సినిమా ఓ కామిక్ రిలీఫ్. ఇది జెన్యూన్ ఫిల్మ్‌. ఇందులోని ప్ర‌తి ఎమోష‌న్ జెన్యూన్‌గా అనిపిస్తుంది. ఎక్క‌డా ఫోర్స్‌డ్‌గా అనిపించ‌దు. ఇందులోని క్యారెక్ట‌ర్ల‌ను కానీ ఏ యాక్ట‌ర్ల‌నీ దృష్టిలో పెట్టుకొని రాయ‌లేదు. ఒక జెన్యూన్ స్క్రిప్ట్ చేశాం. అందులోని క్యారెక్ట‌ర్ల‌కు ఎవ‌రైతే బాగుంటామ‌ని అనుకున్నామో వాళ్ల‌ను తీసుకున్నాం. ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌కు, అందులోని చిలిపిత‌నానికీ జ‌గ‌ప‌తిబాబు గారైతే బాగా న్యాయం చేస్తార‌నీ, ఆయ‌నైతే దానికి క‌రెక్టుగా స‌రిపోతార‌నీ అనిపించి, ఆయ‌న‌ను అప్రోచ్ అయ్యాం. విన‌గానే ఆయ‌న క్యారెక్ట‌ర్‌కు క‌నెక్ట‌యి ఓకే చెప్పారు. ఇది అందరు చూదగ్గ సినిమా. ” అన్నారు