జగపతికిష్టమైన మెగా హీరో....

Thursday,July 13,2017 - 08:07 by Z_CLU

ప్రెజెంట్ టాలీవుడ్ లో విలన్ క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్స్ తో హల్చల్ చేస్తూ ఆకట్టుకుంటున్న జగపతి బాబు రీసెంట్ గా తనకిష్టమైన స్టార్ హీరో గురించి చెప్పాడు. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో మీకు ఎవరంటే  బాగా ఇష్టం అని  ఓ ఇంటర్వ్యూ లో అడగగా “నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మెగా హీరో అనే ఇమేజ్ ను ఉపయోగించుకోకుండా కేవలం తన టాలెంట్ తో ఎదుగుతున్నాడు. అల్లు అర్జున్ లో ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. అందుకే ఇప్పుడున్న స్టార్స్ హీరోల్లో  బన్నీ అంటే చాలా ఇష్టం.” అంటూ చెప్పుకొచ్చాడు జగ్గు భాయ్.

ఇక అల్లు అర్జున్ తర్వాత నాని మంచి నటుడు అనిపిస్తున్నాడు. లేటెస్ట్ గా తను ఎంచుకుంటున్న సినిమాలు నటన బాగా నచ్చాయని తెలిపాడు. సో తనకి నచ్చిన మెచ్చిన స్టార్ హీరోల గురించి ఇలా ఓ సందర్భం లో చెప్పుకొచ్చాడు జగపతి