Pushpa Villain - ఫహాజ్ ఫాజిల్ ఫస్ట్ లుక్

Saturday,August 28,2021 - 04:38 by Z_CLU

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తోంది పుష్ప. ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా క‌లిసి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి మరో లుక్ బయటకొచ్చింది.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. భన్వర్ సింగ్ షెకావత్ IPSగా ఫ‌హాద్ ఫాజిల్ పుష్ప: ది రైజ్‌లో కనిపించబోతున్నారు. తాజాగా ఈయన ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

ఇప్పటికే విడుదలైన ఈయన బర్త్ డే పోస్టర్‌లో EVIL WAS NEVER SO DANGEROUS అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు విడుదలైన పోస్టర్ కూడా అలాగే ఉంది. దీన్ని బట్టి ఫహాద్ పాత్రను సుకుమార్ ఎలా డిజైన్ చేస్తున్నారో అర్థమవుతుంది. గుండుతో ఉన్న ఫహాద్ ఫాజిల్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేకకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

fahadh faasil first look Pushpa movie

నటీనటులు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు

టెక్నికల్ టీం:
దర్శకుడు: సుకుమార్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్
లిరిసిస్ట్: చంద్రబోస్
క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్
మేకప్: నాని భారతి
CEO: చెర్రీ
కో డైరెక్టర్: విష్ణు
లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా
PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics