Pushpa - విలన్ గా మలయాళీ స్టార్

Monday,March 22,2021 - 12:41 by Z_CLU

అల వైకుంఠ‌పురంలో లాంటి ఇండ‌స్ట్రి హిట్ త‌రువాత‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రంగస్థ‌లం‌ లాంటి ఇండ‌స్ట్రి హిట్ త‌రువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌రువాత హ్యాట్రిక్ చిత్రం గా తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప‌.

ఆగ‌స్ట్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అప్ డేట్స్ కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పుష్పరాజును ఢికొట్టే దీటైన విల‌న్ ఎవ‌ర‌నే ఉత్కంఠ అంత‌టా నెల‌కొంది, ఆ ఊహాగానాల‌కు తెర‌దించుతూ పుష్ప‌లో న‌టించ‌నున్న విల‌న్ ఎవ‌ర‌నే విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు మైత్రీ మూవీ మేకర్స్.

జాతియ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ పుష్ప‌లో విలన్ గా న‌టిస్తున్నారు. ఫ‌హాద్ న‌టించిన ప‌లు మ‌ళ‌యాలీ చిత్రాలు తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ కూడా సినీ అభిమానులు ఆద‌ర‌ణ దక్కించుకున్నాయి. ఫ‌హాద్ ఫాజిల్ లేటెస్ట్ మూవీ ట్రాన్స్, సీ యూ సూన్ వంటి సినిమాలు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాయి.

ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌చేసి తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్న‌డ మ‌రియు హింది భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల అగ‌ష్టు 13న విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు.