F3 Movie - టాకీ పూర్తి చేసుకున్న క్రేజీ సీక్వెల్

Sunday,January 30,2022 - 06:05 by Z_CLU

F3 Movie Shooting Updates

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ‘F2’ కి సీక్వెల్ గా రాబోతున్న ‘F3’ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నిన్నటితో సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. కొన్ని రోజుల బ్రేక్ అనంతరం ఇటివలే జరిగిన షెడ్యుల్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ మిగతా నటీ నటులపై కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. AMB సినిమాస్ , రామానాయుడులో జరిగిన షూట్ తో టాకీ ఫినిష్ చేశారు.

ఈ సినిమాలో ఫన్ , ఫ్రస్ట్రేషన్ తో పాటు ఫైనాన్స్ ని కూడా యాడ్ చేసి మోర్ ఫన్ ఉండేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాడు అనిల్ రావిపూడి. F2 లో ఉన్న ఆర్టిస్టులతో పాటు ఈసారి సునీల్ కామెడీ కూడా హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయనుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

త్వరలోనే సినిమా నుండి మొదటి సాంగ్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ అవ్వనుంది. ఏప్రిల్ 28 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.