F3 Movie - షూటింగ్ అప్ డేట్స్!

Sunday,September 19,2021 - 06:29 by Z_CLU

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబోలో ‘F2’ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘F3’ సినిమాకి సంబంధించి మరో షెడ్యుల్ మొదలైంది. హైదరబాద్ సారధి స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో నిన్నటి నుండి షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం వెంకటేష్ , వరుణ్ , తమన్నా , మెహ్రీన్ , సునీల్ లతో పాటు మిగతా కాస్టింగ్ అంతా షూట్ లో పాల్గొంటున్నారు.

రేపు కూడా సారధి స్టూడియోస్ లోనే షూట్ జరగనుంది. అనంతరం శంషాబాద్ సమీపంలో ఉన్న లొకేషన్ కి టీం షిఫ్ట్ అవ్వనున్నారు. దాదాపు ఇరవై రోజుల పాటు ఈ షూట్ జరగనుందని సమాచారం. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు జరుగుతున్న షెడ్యుల్ లో కీలక సన్నివేశాలు తీయనున్నారు. తర్వాత సాంగ్స్ షూట్ మొదలు పెట్టి అక్టోబర్ చివరి కల్లా టోటల్ షూట్ కి ప్యాకప్ చెప్పే ప్లానింగ్ లో ఉన్నారు.

F2 సినిమా సంక్రాంతి కి విడుదలై ఏ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిందో తెలిసిందే. అందుకే ఈ సీక్వెల్ ని కూడా సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఏ మేరకు ఆ మధ్య ప్రకటన కూడా ఇచ్చేశారు. కానీ వచ్చే సంక్రాంతి పోటీలో మహేష్ ‘సర్కారు వారి పాట’ , పవన్ ‘భీమ్లా నాయక్’ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ నిలిచాయి. ఈ పోటీ కారణంగా సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఫిబ్రవరి లేదా మార్చ్ లో సినిమాను రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics