F3 Movie - రిలీజ్ వాయిదా!
Thursday,May 06,2021 - 03:20 by Z_CLU
ప్రస్తుతం తెలుగు సినిమాలు వరుసగా విడుదల వాయిదా పడుతున్నాయి. కరోన సెకండ్ వేవ్ కారణంగా అనుకున్న డేట్ కి సినిమాలు రిలీజ్ చేయలేకపోతున్నారు నిర్మాతలు. ఇప్పటికే స్టార్ హీరోలు నటిస్తున్న పలు భారీ సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యాయి. తాజాగా వెంకటేష్ -వరుణ్ లు నటిస్తున్న ‘F3’ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. అవును ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడి ప్రకటించాడు. ఇటివలే ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో విషయాన్ని తెలియజేశాడు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ చేసే అవకాశం లేదని అందువల్ల దాదాపు అన్ని సినిమాలు వాయిదా పడనున్నాయని చెప్తూ F3 కూడా ముందుగా ప్రకటించినట్టు ఆగస్ట్ లో రిలీజ్ కాదని చెప్పాడు. త్వరలోనే మరో డేట్ లాక్ చేసుకొని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేదెప్పుడో చెప్తామని అన్నాడు.
నిజానికి చాలా తక్కువ షూటింగ్ డేస్ లో సినిమాను కంప్లీట్ చేయాలనుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ స్టేజిలోనే పకడ్బందీగా షెడ్యుల్స్ ప్లాన్ చేశారు. కానీ ఉన్నపళంగా కోవిడ్ సెకండ్ వేవ్ రావడంతో అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. అందుకే రిలీజ్ వాయిదా వేసుకున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాత దిల్ రాజు.

వెంకీ , వరుణ్ నటించిన ‘F2’ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాతో టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు అనిల్ రావిపూడి. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న F3 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి కామెడీ డోస్ కూడా పెంచబోతున్నట్లు సినిమా స్టార్ట్ చేయకముందే చెప్పాడు అనిల్. ఇక వెంకీ , వరుణ్ లతో పాటు ఈసారి సునీల్ కూడా యాడ్ అయ్యాడు. సో ఈసారి అనిల్ మళ్ళీ తన మార్క్ కామెడీతో విపరీతంగా అలరించడం ఖాయమనిపిస్తుంది.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics