F3 Launch - అంతేగా.. అంతేగా..

Thursday,December 17,2020 - 01:46 by Z_CLU

బ్లాక్ బస్టర్ హిట్టయిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. ఈరోజు F3 Movie లాంఛ్ అయింది. దిల్ రాజు ఆఫీస్ లో సింపుల్ గా ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు.

f3_movie_launch-anil_ravipudu-Varun_tej-tamanna-zeecinemalu

అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. హీరో Varun Tej, హీరోయిన్ Tamanna పై క్లాప్ కొట్టారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో డిసెంబర్ 23 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

f3_movie_launch-anil_ravipudu-Varun_tej-tamanna-zeecinemalu

ఎఫ్2 కంటే ఎఫ్3 లో మరింత ఫన్ గ్యారెంటీ అంటున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. మనీ థీమ్ తో రాబోతున్న ఈ మూవీ 2021లో రిలీజ్ అవుతుందని ప్రకటించాడు.

f3_movie_launch-anil_ravipudu-Varun_tej-tamanna-zeecinemalu

ఎఫ్2లో ఉన్న బ్యాచ్ మొత్తం ఎఫ్3లో కూడా కనిపించనుంది. యాడ్-ఆన్స్ ఎవరనే విషయాన్ని అనీల్ రావిపూడి ప్రస్తుతానికి బయటపెట్టలేదు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Also Check – అనీల్ రావిపూడి సెంటిమెంట్ ఇదే