F3 Movie - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,May 30,2022 - 01:09 by Z_CLU

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన నటించిన ఎఫ్3 సినిమా బాక్సాఫీస్ బరిలో సూపర్ హిట్టయింది. థియేటర్లలో ప్రేక్షకులకు ఫన్ ఫెస్టివల్ తీసుకొచ్చిన ఈ సినిమా, సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. ఈ 3 రోజుల్లో సినిమాకు వరల్డ్ వైడ్ 63.5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు మేకర్స్.

మొదటి రోజు మిక్స్ డ్ టాక్ తో ఓపెన్ అయింది ఈ సినిమా. అయితే మౌత్ టాక్ బాగుండడంతో శని, ఆదివారం ఈ సినిమా థియేటర్లు ఎగబడ్డారు. అలా భారీ కలెక్షన్లు వస్తున్నాయి.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా పెద్ద హిట్టయింది. 3 రోజులకే ప్రీమియర్స్ తో కలుపుకొని మిలియన్ డాలర్ క్లబ్ కు చేరువైంది ఈ సినిమా. ఇప్పటివరకు ఈ సినిమాకు 9 లక్షల 80వేల డాలర్లు వచ్చాయి. సోమవారం యూఎస్ లో పబ్లిక్ హాలిడే. సో.. ఎఫ్3 సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడంతో పాటు భారీ వసూళ్లు కూడా వస్తాయని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics