సాగర తీరాన ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్

Saturday,December 29,2018 - 03:30 by Z_CLU

టాలీవుడ్ కు సంబంధించి విశాఖలో మరో బిగ్ ఈవెంట్ జరగబోతోంది. అదే ఎఫ్-2 ఆడియో లాంచ్. వైజాగ్ ఆర్కే బీచ్ లో రేపు సాయంత్రం ఈ సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్రప్రసాద్ తో పాటు హీరోయిన్లు తమన్న, మెహ్రీన్ హాజరుకాబోతున్నారు.

ఎఫ్2 సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. బ్యాక్ టు బ్యాక్ మ్యూజికల్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ సంగీత దర్శకుడు ఎఫ్-2కు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. లిరికల్ వీడియోస్ రూపంలో కొన్ని సాంగ్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. వీటితో పాటు మిగతా అన్ని సాంగ్స్ ను రేపు సాగరతీరంలో రిలీజ్ చేయబోతున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది ఎఫ్-2.