'F2' ఐదు రోజుల కలెక్షన్స్

Thursday,January 17,2019 - 01:42 by Z_CLU

‘F2’తో సంక్రాంతి అల్లుళ్ళు గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ -వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఐదు రోజులకు గానూ 90 శాతం రికవరీ సాదించింది. ఇప్పటికే ఏపి, తెలంగాణాలో 25 కోట్ల 83 లక్షల షేర్ సాదించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 30 కోట్లు దాటేసింది. రేపటి నుండి ఈ సినిమాకు ఆంద్ర ప్రదేశ్ , తెలంగాణాలో భారీగా థియేటర్స్ పెరగనున్నాయి. ఈ స్పీడ్ తో ‘F2’ ఈ వారమే 50 కోట్ల మార్క్ రీచ్ అవ్వడం ఖాయమంటున్నారు సినీ పండితులు.

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణాలో ‘F2’ఐదు రోజుల షేర్ వివరాలివే.

నైజాం : 8 కోట్ల 96 లక్షలు

సీడెడ్ : 3 కోట్ల 42 లక్షలు

ఉత్తరాంధ్ర : 3 కోట్ల 15 లక్షలు

ఈస్ట్ గోదావరి : 3 కోట్ల 9 లక్షలు

వెస్ట్ గోదావరి : 1 కోటి 74 లక్షలు

గుంటూరు : 2 కోట్ల 33 లక్షలు

కృష్ణా : 2 కోట్ల 30 లక్షలు

నెల్లూరు :  84 లక్షలు