ఫిబ్ర‌వ‌రి 12న 'ఎఫ్‌సీయూకే'

Monday,January 18,2021 - 05:06 by Z_CLU

జగపతిబాబు ప్రధాన పాత్రలో, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి  జంటగా తెరకెక్కిన ‘ఫాదర్-చిట్టి-ఉమ- కార్తీక్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. విద్యాసాగ‌ర్ రాజు దర్శకుడిగా శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్నఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తాజాగా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. లాక్ డౌన్ కంటే ముందే సినిమా షూటింగ్ పూర్తయిందని  2020 ఏప్రిల్ లో  రిలీజ్ అనుకొని లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా వేసుకున్నామని నిర్మాత తెలిపారు.

father-chitti-uma-karthik-pressmeet

ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా జీవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. విద్యా సాగర్ డైరెక్షన్ లో రొమాంటిక్ కామెడీ  జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ఆదిత్య, కరుణాకర్ మాటలు అందించారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.