రాజా ది గ్రేట్.. ఎల్లుండి నుంచి మరిన్ని నవ్వులు

Thursday,November 02,2017 - 11:26 by Z_CLU

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `రాజా ది గ్రేట్‌`. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మాత‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ప‌టాస్‌, సుప్రీమ్ వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో స‌క్సెస్‌ను అందుకున్న యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈసినిమాను డైరెక్ట్ చేశారు. అక్టోబ‌ర్ 18న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాతో భారీ విజ‌యాన్ని అందించిన ప్రేక్షకులకు ఇంకా వినోదాన్ని అందించ‌డానికి నిర్మాత దిల్‌రాజు ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎడిటింగ్‌లో తీసేసిన కామెడీ సీన్స్‌ను ఇప్పుడు సినిమాలో యాడ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఫ‌న్ రైడ్‌గా ఉన్న ఈ సినిమా ఈ సీన్స్ యాడింగ్ వ‌ల్ల మ‌రింత వినోదాన్ని ప్రేక్ష‌కుల‌కు పంచ‌నుంద‌న‌టంలో సందేహం లేదు. ఎల్లుండి (నవంబర్ 4) నుంచి ఈ కామెడీ సీన్లు థియేటర్లలో మరింత వినోదాన్ని పంచనున్నాయి.

అనిల్ రావిపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రవితేజ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. రవితేజ తల్లిగా కీలకపాత్రలో రాధిక నటించారు. సాయికార్తీక్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.