ప్రేక్షకులకు బోనస్ ప్రకటించిన మహేష్

Wednesday,January 22,2020 - 05:42 by Z_CLU

అవును.. నిజంగానే ఇది ప్రేక్షకులకు బోనస్. సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. అంతా ఈ సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడా ఎంజాయ్ మెంట్ ను డబుల్ చేసే డెసిషన్ తీసుకుంది యూనిట్. ఈ వీకెండ్ నుంచి మరో కామెడీ సీన్ ను యాడ్ చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం రెండో వారంలో కొనసాగుతున్న ఈ సినిమాకు ఇంకాస్త ఆక్యుపెన్సీ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది యూనిట్. సినిమాలో హిలేరియస్ గా పేలిన ట్రయిన్ ఎపిసోడ్ కు అదనంగా మరో కామెడీ సీన్ ను జోడించబోతున్నారు. రావురమేష్ ఫ్యామిలీ, మహేష్ బాబు మధ్య వచ్చే ఈ సరదా సన్నివేశం ఒకటిన్నర నిమిషం డ్యూరేషన్ ఉంటుంది.

ఇప్పటికే తన కామెడీతో నెవ్వర్ బిఫోర్-ఎవ్వర్ ఆఫ్టర్ అనిపించుకున్నాడు మహేష్ బాబు. ఇప్పుడీ ఎక్స్ ట్రా కామెడీ డోస్ తో సరిలేరు నాకెవ్వరు అనిపించుకోవడం ఖాయం.