Prabhas అంచనాలు పెంచేస్తున్న సలార్

Tuesday,April 19,2022 - 04:04 by Z_CLU

Expectations on Prabhas’s ‘Salaar’ are sky high

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘సలార్’ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో హంగామా చేస్తున్న ‘KGF 2’ ని దృష్టిలో పెట్టుకొని ప్రశాంత్ నీల్  ప్రభాస్ తో అదే రేంజ్ యాక్షన్ సినిమా చేస్తాడని భావిస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అలాగే ‘KGF 2’ లో మాస్ కంటెంట్ ని విపరీతంగా ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఇప్పుడు ప్రభాస్ తో ప్రశాంత్ ఇంకా నెక్స్ట్ లెవెల్ మాస్ కంటెంట్ ఇస్తాడని  ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

‘సలార్’ షూట్ నుండి తాజాగా లీకైన ప్రభాస్ స్టిల్ తో సోషల్ మీడియాలో ప్రస్తుతం భారీ చర్చ నడుస్తుంది. సిగరెట్ కాలుస్తూ ప్రభాస్ మ్యచో లుక్ తో లీకైన స్టిల్ పోస్ట్ చేస్తూ సలార్ పై తమ అంచనాలను పంచుకుంటున్నారు ఫ్యాన్స్. నిజానికి మాస్ ఎలివేషన్స్ తో థియేటర్స్ లో పూనకం తెప్పించే ప్రశాంత్ నీల్ కి బాహుబలి కటౌట్ దొరికితే మాములుగా ఉండదు.  డార్లింగ్ ని ఎలివేట్ చేసే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించడం పక్కా అని  ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ట్రేడ్ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే కొంత పార్ట్ షూట్ ఫినిష్ చేసిన ప్రశాంత్ త్వరలోనే మరో భారీ షెడ్యుల్ స్టార్ట్ చేయనున్నాడని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ పాల్గొంటున్నాడు. ఆ షెడ్యుల్ పూర్తవ్వగానే సలార్ మరో షెడ్యుల్ మొదలవుతుంది. ప్రభాస్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

   * Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics