ఎక్స్ క్లూజీవ్ : నాని సినిమాకి హీరోయిన్ ఫిక్స్

Friday,October 12,2018 - 12:43 by Z_CLU

నాని నెక్స్ట్ మూవీ  ‘జెర్సీ’ కి హీరోయిన్ ను ఫిక్స్ అయింది… ఇటివలే ఈ సినిమా హీరోయిన్ లిస్టు లో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించగా ఫైనల్ గా శ్రద్ధ శ్రీనాథ్ ని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసుకున్నారు మేకర్స్. కన్నడలో ‘యూ టర్న్’, తమిళ్ లో విక్రం వేద’ సినిమాలతో పాపులర్ అయిన ఈ భామ ‘దేవదాస్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానుందని అప్పట్లో వార్తలొచ్చాయి…కాని ఫైనల్ గా ‘జెర్సీ ‘తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతుంది శ్రద్ధ.

క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ప్రస్తుతం క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు నేచురల్ స్టార్.. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. విజయదశమి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.