జీ ఎక్స్ క్లూజివ్ : చంద్రబాబుగా రానా

Thursday,August 02,2018 - 04:40 by Z_CLU

మార్కెట్లో రోజురోజుకు ఎన్టీఆర్ బయోపిక్ క్రేజ్ పెరుగుతోంది. కేవలం బడ్జెట్ పరంగానే కాకుండా, స్టార్ కాస్ట్ పరంగా కూడా ఈ సినిమా హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విద్యాబాలన్ ఈ ప్రాజెక్టులోకి ఎంటరైంది. ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు రానా కూడా ఎంటరయ్యాడు. అవును.. ఎన్టీఆర్ బయోపిక్ లో రానా నటిస్తున్నాడు.

సినిమాలో అత్యంత కీలకమైన చంద్రబాబు పాత్రలో రానా కనిపించబోతున్నాడు. ఈ మేరకు రానాపై టెస్ట్ కట్ కూడా పూర్తయింది. త్వరలోనే తన కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసుకొని ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి రాబోతున్నాడు రానా.

చంద్రబాబు పాత్రకు సంబంధించి రానా-క్రిష్ మధ్య చర్చలు జరిగినట్టు గతంలోనే పుకార్లు వచ్చాయి. ఇప్పుడవి నిజమని తేలింది. మరోవైపు ఈ సినిమాలో కృష్ణ పాత్ర కూడా ఉంది. ఆ క్యారెక్టర్ కోసం మహేష్ బాబును అనుకుంటున్నారు. ఏఎన్నార్ పాత్ర కోసం సుమంత్ లేదా నాగార్జునను అనుకుంటున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ను ఇప్పటికే సంప్రదించారు.

 ఈ పాత్రలపై త్వరలోనే వన్ బై వన్ క్లారిటీ వస్తుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయనున్నారు.