మరికొన్ని గంటల్లో గ్రాండ్ రిలీజ్

Thursday,September 29,2016 - 12:42 by Z_CLU

నేను శైలజ లాంటి హిట్ తర్వాత రామ్ నటించిన మూవీ హైపర్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ కథాంశం హైలెట్ గా నిలిచింది. జిబ్రాన్ అందించిన ట్యూన్స్ తో పాటు… రామ్-రాశిఖన్నా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్ గా నిలిచాయి. ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం ఇప్పటికే సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న హైపర్ సినిమా.. మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ మేకింగ్ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.