ఎక్స్ క్లూజీవ్ : రామ్ , లింగుస్వామి మూవీ లాంచ్ డీటెయిల్స్

Wednesday,February 17,2021 - 07:04 by Z_CLU

‘రెడ్’ తర్వాత రామ్ ఎవరితో సినిమా చేస్తాడా ? అనే ప్రశ్నకి రేపే జవాబు ఇవ్వబోతున్నాడు రామ్. తన నెక్స్ట్ సినిమాను లింగుస్వామి డైరెక్షన్ లో చేయబోతున్నాడు ఎనర్జిటిక్ స్టార్. రేపే ఈ కాంబో సినిమా మూవీ ఆఫీసులో పూజా కార్యక్రమాలతో లాంచ్ కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఎప్పటి నుండో తెలుగులో ఒక సినిమా డైరెక్ట్ చేయాలని చూస్తున్న లింగుస్వామి ఆ మధ్య అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. కానీ అది ఎనౌన్స్ మెంట్ స్టేజిలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఎట్టకేలకు రామ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు మాస్ డైరెక్టర్. ‘ఇస్మార్ట్ శంకర్’ , ‘రెడ్’ వంటి మాస్ సినిమాల తర్వాత లింగుస్వామి డైరెక్షన్ లో రామ్ చేయబోతున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని మరింతగా ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తుంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.