ఎక్స్ క్లూజీవ్ : కార్తికేయ హీరోగా '90ఎంఎల్'

Sunday,February 10,2019 - 03:06 by Z_CLU

‘ఆర్ .ఎక్స్ 100’ ఫేం కార్తికేయ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ‘హిప్పీ’ సినిమాతో పాటు అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో సినిమా చేస్తున్న ఈ హీరో త్వరలో నాని సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాల తర్వాత మరో డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. మద్యానికి బానిసైన ఓ కుర్రాడి కథతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ’90 ఎం.ఎల్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.