'ధృవ' టైటిల్ సీక్రెట్స్ ఎక్స్ క్లూజివ్ గా..

Sunday,September 04,2016 - 01:14 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం ‘ధృవ’. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదే టైటిల్ పెడతారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఆ టైటిల్ గ్రాఫిక్ లో 8 అనే నంబర్ ను యాడ్ చేయడం మాత్రం అందర్లో క్యూరియాసిటీ పెంచింది.

    ధృవ టైటిల్ లోనే ఇన్-బిల్ట్ గా 8 అనే సంఖ్య కనిపిస్తుంది. ఈ సంఖ్య చుట్టూ టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద బజ్ నడుస్తోంది. అసలు ధృవ సినిమాకు ఈ నంబర్ కు సంబంధం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. కొంతమంది సినిమాలో ఓ కీలకమైన మలుపు నంబర్-8తోనే ఉంటుందని చెబుతుంటే.. మరికొందరు మాత్రం సురేందర్ రెడ్డి 8వ చిత్రం కాబట్టి అలా పెట్టారని అంటున్నారు. కానీ అసలు ఆ సంఖ్యను అలా ఎందుకు పెట్టారనే విషయంపై మాత్రం యూనిట్ నుంచి క్లారిటీ లేదు. సినిమాకు అదే పెద్ద ప్రమోషనల్ ఎలిమెంట్ గా మారడంతో యూనిట్ సభ్యులు కూడా ఆ విషయాన్ని రివీల్ చేయడం లేదు. థని ఒరువన్ అనే తమిళ హిట్ సినిమాకు రీమేక్ గా ధృవ తెరకెక్కుతోంది. కానీ తమిళ వెర్షన్ లో 8 సంఖ్య ప్రస్తావన లేదు. దీంతో ధృవపై ఆసక్తి మరింత పెరిగింది.

dhruva ftr