ఎక్స్ క్లూజీవ్ : భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న దేవి

Sunday,February 03,2019 - 11:08 by Z_CLU

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ ఏడాదితో మ్యూజిక్ డైరెక్టర్ గా 20 ఏళ్ళు పూర్తిచేసుకోనున్నాడు. దేవి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన మొదటి సినిమా ‘దేవి’ మార్చ్ తో 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకోనుంది. ఈ సందర్భంగా అందరితో కలిసి తన హ్యాపీ నెస్ ను షేర్ చేసుకోవాలని భావిస్తున్నాడు దేవి. ఇందుకోసం ఓ భారీ ఈవెంట్  ప్లాన్ ను చేస్తున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ కి తెలుగు,తమిళ్ ఇండస్ట్రీస్ నుండి కొందరు టాప్ హీరోలను , దర్శకులను , నిర్మాతలను ఇన్వైట్ చేయబోతున్నాడట.

ఇప్పటికే ఇతర దేశాల్లో లైవ్ కాన్సర్ట్ తో అదరగొట్టేసిన ‘డి.ఎస్.పి’ తన సక్సెస్ ఫుల్ జర్నీ కి సంబంధించిన ఈవెంట్ ను కూడా అదే రీతిలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడని, ఇప్పటికే దానికి సంబంధించిన ప్లానింగ్ లో ఉన్నాడని సమాచారం. మరి ఈ ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నాడు…? ఈవెంట్ మార్చ్ లోనే ఉంటుందా? అనేవి తెలియాల్సి ఉంది.