మహేష్ బాబు మార్క్ కనిపిస్తుంది...

Friday,April 19,2019 - 06:38 by Z_CLU

నిన్ననే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది మహర్షి టీమ్. దాంతో ప్రమోషన్స్ స్పీ పెంచేశారు మేకర్స్. ఇప్పటి వరకు ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ ఎట్రాక్ట్ చేసిన మహర్షి మేకర్స్, సినిమా నుండి ‘ఎవరెస్ట్ అంచున…’ అంటూ సాగే డ్యూయెట్ ప్రోమో రిలీజ్ చేశారు.

సోషల్ మీడియాలో ఈ ప్రోమోకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో ఈ సాంగ్ ఏ సిచ్యువేషన్ లో ఉండబోతుందనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ,  ఆడియెన్స్  లో  మాత్రం ఫుల్ జోష్  నింపనుంది  ఈ డ్యూయట్. మహేష్ బాబు, పూజా హెగ్డే ల కెమిస్ట్రీ అదుర్స్ అనిపించుకుంటుంది.

DSP మ్యూజిక్ కంపోజ్ చేశాడు ఈ సినిమాకి. వంశీ పైడిపల్లి డైరెక్టర్. వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, PVP సినిమాస్ బ్యానర్స్ పై ‘మహర్షి’ తెరకెక్కుతుంది.