Evelyn Sharma - పెళ్లి చేసుకున్న సాహో హీరోయిన్

Monday,June 07,2021 - 03:11 by Z_CLU

లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల జాబితాలోకి మరో హీరోయిన్ చేరింది. సాహో సినిమాలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ ఎవ్లీన్ శర్మ పెళ్లి చేసుకుంది. ఏడాదిగా డేటింగ్ చేస్తున్న బాయ్ ఫ్రెండ్ తుషాన్ ను ఆస్ట్రేలియాలో పెళ్లాడింది. ఈరోజు ఆ పెళ్లి ఫొటోలు బయటకొచ్చాయి.

Evelyn Sharma wedding marriage zeecinemalu

ఎవ్లీన్ శర్మ వివాహం

ట్విస్ట్ ఏంటంటే.. ఎవ్లీన్ పెళ్లి 3 వారాల కిందటే జరిగిపోయింది. కానీ ఆ మేటర్ ను ఈరోజు బయటపెట్టింది ఎవ్లీన్. కొన్ని పెళ్లి ఫొటోలు కూడా రివీల్ చేసింది. దీంతో అంతా ఆమెకు ఈరోజే పెళ్లయిందని అనుకుంటున్నారు. కానీ మే 15న ఎవ్లీన్-తుషాన్ పెళ్లి చేసుకున్నారు.

Evelyn Sharma wedding marriage zeecinemalu

ఎవ్లీన్ శర్మ పెళ్లి ఫొటోలు

ఎంగేజ్ మెంట్ విషయంలో కూడా ఎవ్లీన్ ఇలానే చేసింది. 2019లో సిడ్నీలో ఎవ్లీన్-తుషాన్ ఎంగేజ్ మెంట్ జరిగింది. కానీ ఆ విషయాన్ని నెల రోజుల తర్వాత బయటపెట్టింది. సాహోలో జెన్నిఫర్ అనే రోల్ ప్లే చేసిన ఈ ముద్దుగుమ్మ.. తను డేటింగ్ లో ఉన్నట్టు రెండేళ్ల కిందటే ప్రకటించింది. ఇప్పుడు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైంది.

Evelyn Sharma wedding marriage zeecinemalu

ఎవ్లీన్ శర్మ పెళ్లి ఫొటోలు

ఎవ్లీన్-తుషాన్ కు 2018లో పరిచయమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఏడాది పాటు ప్రేమించుకున్న తర్వాత నిశ్చితార్థం చేసుకున్నారు. ఎంగేజ్ మెంట్ పూర్తయిన మరో ఏడాదికి పెళ్లి చేసుకున్నారు. హిందీలో యే జవానీ హే దీవాని, నాటౌంకీ సాలా, మై తేరా హీరో, హిందీ మీడియం లాంటి సినిమాల్లో నటించింది ఎవ్లీన్. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ నుంచి పెద్దగా సినిమా ఆఫర్లు రావడం లేదు.

Evelyn Sharma wedding marriage zeecinemalu Evelyn Sharma wedding marriage zeecinemalu

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics