ఎవరు ట్రయిలర్ రివ్యూ.. మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్

Monday,August 05,2019 - 11:40 by Z_CLU

అడవి శేష్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ రెడీ అయింది. కొద్దిసేపటి కిందట విడుదలైన ఎవరు ట్రయిలర్ చూస్తే ఆ విషయం అర్థమౌతుంది. మర్డర్ మిస్టరీనా, రేప్ రివెంజా డ్రామానా అనే విషయం అర్థంకాకుండా ట్రయిలర్ ను ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. మరోవైపు అడవి శేష్ మంచోడా.. లేక నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోనా అనే విషయంపై కూడా ఫీలర్ వదులుతూ ట్రయిలర్ కట్ అయింది.

ఓవరాల్ గా సినిమా మొత్తం అడవి శేష్, రెజీనా మధ్య నడుస్తుందనే విషయం ట్రయిలర్ చూస్తే తెలుస్తూనే ఉంది. తనను రేప్ చేయడానికి వచ్చిన వ్యక్తిని రెజీనా చంపేస్తుంది. అయితే అతడు నిజంగానే రేప్ ఎటెంప్ట్ చేశాడా లేక ఇదొక మర్డరా అనే విషయం చుట్టూ ఎవరు సినిమా తిరగనుంది. ట్రయిలర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హై-లెవెల్ లో ఉన్నాయి.

గతంలో క్షణం మూవీతో ఆకట్టుకున్న అడవి శేష్, ఈసారి కూడా అన్ని తానై ఆ సినిమాను తెరకెక్కించాడు. వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలోకి వస్తోంది. పీవీపీ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల దర్శకుడు.