ప్రభాస్ కోసం ఇండియాలోనే యూరోప్ సెట్

Wednesday,June 20,2018 - 06:06 by Z_CLU

మ్యాగ్జిమం ఆగష్టులో సెట్స్ పైకి వచ్చేస్తుంది ప్రభాస్ సినిమా. ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్న రెబల్ స్టార్, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా సెట్స్ పైకి వచ్చేస్తాడు. అందుకే ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమా యూనిట్ ఈ సినిమా కోసం భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారు.

అల్టిమేట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా మ్యాగ్జిమం షూటింగ్ యూరోప్ లో జరగనుంది. అయితే కొని ఇంపార్టెంట్ సీన్స్ ని ఇండియాలోనే తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్న ఫిల్మ్ మేకర్స్, ఇండియాలోనే  యూరోప్ ని తలపించేలా భారీ సెట్స్ నిర్మిస్తున్నారు.

ఆర్ట్ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ సెట్స్ నిర్మాణంతో పాటు ఇప్పటికే డమ్మీ హెలీకాప్టర్, ట్రైన్, షిప్ ని రెడీ చేసిన ఫిల్మ్ మేకర్స్, మ్యాగ్జిమం ఆగష్టు కల్లా ఈ సెట్ వర్క్ కి ప్యాకప్ చెప్పేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించనుంది. UV క్రియేషన్స్ తో పాటు ప్రభాస్ సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.