ఎక్స్ క్లూజివ్: రామ్ చరణ్ సినిమాలో ఈషా గుప్తా

Wednesday,December 12,2018 - 10:36 by Z_CLU

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న వినయ విధేయ రామ సినిమాలో ఐటెంసాంగ్ కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలించారు. ముందుగా రకుల్ పేరు వినిపించింది. తర్వాత కాజల్ అన్నారు. రీసెంట్ గా క్యాథరీన్ పేరు కూడా చక్కర్లుకొట్టింది. ఫైనల్ గా ఆ ఛాన్స్ బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తాను వరించింది.

అవును.. వినయ విధేయ రామ ఐటెంసాంగ్ కోసం ఈషా గుప్తాను తీసుకున్నారు. ఇదొక పబ్ సాంగ్. కంప్లీట్ అల్ట్రా మోడ్రన్ గా ఉండే బ్యూటీ కావాలి. అందుకే అందరి ప్రొఫైల్స్ పరిశీలించి ఫైనల్ గా బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తాను ఫిక్స్ చేశారు.

ఎల్లుండి (14వ తేది) నుంచి అన్నపూర్ణ స్టుడియోలో వేసిన ప్రత్యేకమైన పబ్ సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే సినిమాలో మిగిలిన మరో డ్యూయట్ ను కూడా ఖానాపూర్ లో చరణ్-కైరా అద్వానీ మధ్య కంప్లీట్ చేయబోతున్నారు. అలా 22వ తేదీనాటికి ప్యాచ్ వర్క్ తో పాటు సినిమా టోటల్ షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.