'ఎంత మంచివాడవురా' అప్ డేట్స్

Tuesday,October 29,2019 - 10:02 by Z_CLU

నందమూరి కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిఅందుకున్నసతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ఎంత మంచి వాడవురా’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అక్టోబర్‌ 9 నుంచి 22 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో, హైదరాబాద్‌ పరిసరాల్లోనూ మూడో షెడ్యూల్‌ జరుపుకున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూలుకు సిద్ధమవుతోంది. ఆఖరి షెడ్యూల్‌ని కేరళలోని మున్నార్‌ తదితర  సుందరమైన ప్రదేశాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్‌ 10 వరకూ జరుపుకోనుంది.

 శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో  ఆదిత్యా మ్యూజిక్‌ బ్యానర్ పై ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది.