రెండో రోజు పుంజుకున్న "ఎంత మంచివాడవురా"

Friday,January 17,2020 - 04:20 by Z_CLU

సంక్రాంతి పండగ టాలీవుడ్ కు ఎంత పెద్ద సీజన్ అనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి రెండు పెద్ద సినిమాల నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ.. ఎంత మంచివాడవురా సినిమా తట్టుకొని నిలబడింది. కల్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా, మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజుకు మరింత పుంజుకుంది.

మొదటి రోజు ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ సంక్రాంతికి సిసలైన ఫ్యామిలీ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది ఈ మూవీ. దీంతో కనుమ రోజైన నిన్న ఈ సినిమాకు ప్రేక్షకులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శిస్తున్న దాదాపు అన్ని థియేటర్లు హౌజ్ ఫుల్స్ నడిచాయి. అలా 2 రోజుల్లో 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టింది ఎంత మంచివాడవురా మూవీ.

మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. మరో 3-4 రోజుల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అవ్వబోతోంది. ఈస్ట్, వెస్ట్ ఏరియాస్ లో అంతకంటే ముందే బ్రేక్-ఈవెన్ అవుతుందని చెబుతోంది ట్రేడ్. అయితే నైజాంలో మాత్రం ఇది బ్రేక్-ఈవెన్ అవ్వడానికి ఇంకాస్త ఎక్కువ టైమ్ పట్టొచ్చు.

ఏదేమైనా ఈ సంక్రాంతి సీజన్ లో మహేష్, బన్నీ మూవీస్ తో పాటు కల్యాణ్ రామ్ మూవీ కూడా క్లిక్ అవ్వడం ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ సైన్. సతీష్ వేగేశ్న డైరక్ట్ చేసిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.