ఎంత మంచివాడవురా ఫస్ట్ లిరికల్ వీడియో

Monday,December 09,2019 - 04:11 by Z_CLU

కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా థీమ్ ఏంటనేది టీజర్ లోనే కొంచెం రివీల్ చేశారు. ఇప్పుడా థీమ్ ను మరింత ఎలివేట్ చేసేలా విడుదలైంది ఫస్ట్ సాంగ్. ఎంతమంచివాడవురా సినిమాకు సంబంధించి విడుదలైన ఈ ఫస్ట్ లిరికల్ వీడియోలో సినిమా థీమ్ మొత్తం ఉంది.

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన ఈ పాటను గోపీసుందర్ కంపోజ్ చేశాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. “ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం” అనే లిరిక్స్ తో సాగే ఈ పాట విన్న వెంటనే హమ్ చేసుకునేలా ఉంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.