కల్యాణ్ రామ్ సినిమా సెన్సార్ పూర్తి

Monday,January 06,2020 - 02:47 by Z_CLU

కల్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వస్తున్న ఎంత మంచివాడవురా సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. అంతా ఊహించినట్టే ఈ సినిమాకు క్లీన్-U సర్టిఫికేట్ వచ్చింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఓ స్టిల్ రిలీజ్ చేసి సెన్సార్ మేటర్ బయటపెట్టారు మేకర్స్. సకుటుంబ సపరివార సమేతంగా అంతా ఉన్న ఆ ఫొటో ప్రస్తుతం అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్త జాయింట్ గా నిర్మించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు, కాస్త యాక్షన్ కూడా మిక్స్ చేసి తీసిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. గోపీసుందర్ కంపోజ్ చేసిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో శతమానంభవతి సినిమాతో ఓ సక్సెస్ అందుకున్న సతీష్ వేగేశ్న… ఎంతమంచివాడవురా మూవీతో మరోసారి సంక్రాంతి హిట్ కొడతానంటున్నాడు.