ఎంత మంచివాడవురా ఫస్ట్ డే కలెక్షన్

Thursday,January 16,2020 - 12:29 by Z_CLU

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎంతమంచివాడవురా మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పండగ సీజన్ లో రిలీజ్ అవ్వడం, సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఉండడంతో.. మొదటి రోజు ఈ మూవీకి డీసెంట్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 16 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఇప్పటికే మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, బన్నీ చేసిన అల వైకుంఠపురములో సినిమాలు థియేటర్లలో పాతుకుపోతాయి. ఇలాంటి టైమ్ లో తక్కువ థియేటర్లతో బరిలోకి దిగిన కల్యాణ్ రామ్ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం పెద్ద విషయమే. ఈ వారమంతా పండగ సీజన్ నడుస్తుంది కాబట్టి, సినిమాకు మరిన్ని వసూళ్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ కల్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా ఓ రీమేక్. గుజరాతీలో వచ్చిన ఆక్సిజన్ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించాడు.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్స్
నైజాం – రూ. 0.65 కోట్లు
సీడెడ్ – రూ. 0.37 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.18 కోట్లు
ఈస్ట్ – రూ. 0.29 కోట్లు
వెస్ట్ – రూ. 0.20 కోట్లు
గుంటూరు – రూ. 0.19 కోట్లు
నెల్లూరు – రూ. 9 లక్షలు
కృష్ణా – రూ. 0.19 కోట్లు