ఎక్కడికి పోతావు చిన్నవాడా 50 డేస్ సెలెబ్రేషన్స్

Thursday,January 12,2017 - 01:00 by Z_CLU

28 థియేటర్స్ లో 50 రోజులు సినిమా ఆడటం అంటే అంత చిన్న విషయం కాదు, అలాగని హెవీ బడ్జెట్ సినిమాల్లా రిలీజ్ కి ముందే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసిన స్టార్ సినిమా కూడా కాదు. నిఖిల్, హెబ్బా పటేల్ నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా సక్సెస్, బాక్సాఫీస్ వెయిట్ పెంచడానికి చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉండదు అని మరోసారి నిరూపించింది.

రొమాంటిక్ హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’  అటు ఓవర్ సీస్ నుండి మొదలు పెడితే రిలీజైన మ్యాగ్జిమం సెంటర్స్ లోను హిట్ టాక్ ని బ్యాగ్ లో వేసుకుంది. ఈ సినిమా సక్సెస్ తో నిఖిల్ కూడా స్టార్ హీరో రేస్ కి క్వాలిఫై అయిపోయాడు.

సినిమా సక్సెస్ గ్యారంటీ అని బిగినింగ్ నుండే కాన్ఫిడెంట్ గా ఉన్న సినిమా యూనిట్, ఈ సినిమా 50 డేస్ సెలెబ్రేషన్స్ దర్శకరత్న దాసరి నారాయణ రావు సమక్షంలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.