ఏక్ మినీ కథ... టీజర్ కు మంచి రెస్పాన్స్

Thursday,March 11,2021 - 04:12 by Z_CLU

యూవీ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ కి అనుబంధంగా యూవీ కాన్సెప్ట్స్ బ్యాన‌ర్ పెట్టి, దానిపై తీస్తున్న మొట్టమొదటి సినిమా “ఏక్ మిని క‌థ”. ఈ సినిమాతో కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఏక్ మినీ కథ చిత్ర ఫస్ట్ లుక్ కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్ప‌డు ఏక్ మిని క‌థ టీజ‌ర్ కూడా కామ‌న్ ఆడియ‌న్స్ అండ్ సోష‌ల్ మీడియా పీపుల్ ని బాగా ఆక‌ట్టుకుంది.

టీజ‌ర్ లో టైమింగ్ తో ఆక‌ట్టుకున్న‌సంతోష్ శోభ‌న్‌
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శోభ‌న్ కుమారుడిగా పేప‌ర్ బాయ్ చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమై మంచి న‌టుడి గా నిరూపించుకున్నాడు సంతోష్ శోభన్. ఇప్ప‌డు ఏక్ మిని క‌థ లాంటి ఢిఫ‌రెంట్ క‌థ తో ప్రేక్ష‌కుడ్ని న‌వ్విండానికి సిధ్ధ‌మ‌య్యాడు. టీజర్ చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.

మేర్ల‌పాక గాంధి-యువి కాంబినేష‌న్‌
ఎక్స్‌ప్రేస్ రాజా చిత్రంతో యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లొ స‌క్స‌ెస్ ని సాధించిన ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధి ఈ చిత్రానికి క‌థ‌ని అందించారు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్దం లాంటి చిత్రాల‌తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న మేర్ల‌పాక గాంధి ఇప్పుడు ఈ ఏక్ మిని క‌థ కి క‌థ‌, ర‌చ‌న ఇవ్వ‌ట‌మే కాకుండా ద‌ర్శ‌కుడు కార్తీక్ రాపోలు కి త‌న ఫుల్ స‌పోర్ట్ అందించడం విశేషం.

ఈ సినిమాకు రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.