శైలజారెడ్డి అల్లుడు నుండి మరో రొమాంటిక్ సింగిల్

Monday,August 27,2018 - 04:29 by Z_CLU

నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా నుండి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజయ్యాయి. వాటికి తోడు ఈ రోజు మరో సింగిల్ ని రిలీజ్ చేశారు ఫిలిమ్ మేకర్స్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై క్రియేట్ అయిన ఇంట్రెస్ట్ ని మరింత రేజ్ చేస్తుంది ఈ సాంగ్.

‘ఎగిరెగిరే…’ అంటూ సాంగే ఈ సాంగ్ సినిమాలోని రొమాంటిక్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తుంది. రీసెంట్ గా ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసిన ఫిలిమ్ మేకర్స్, ఈ రోజు కంప్లీట్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ లిరిక్స్ రాసిన ఈ పాటని సిద్ శ్రీరామ్, లిప్సిక పాడారు. గోపీ సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. రమ్యకృష్ణ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై S. నాగవంశీ, PDV ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.