ఈషా రెబ్బ ఇంటర్వ్యూ

Tuesday,November 19,2019 - 02:33 by Z_CLU

కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో నటించింది ఈషా రెబ్బ. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఈషారెబ్బ డిఫెరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతుంది. ‘రాగల 24 గంటల్లో…’ తన కరియర్ కి మంచి బ్రేక్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్న ఈషా, మీడియాతో మరిన్ని విషయాలు షేర్ చేసుకుంది. 

లక్కీ అనిపించింది…

అంత ఈజీగా దొరకవు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు… ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా లక్కీగా ఫీలవుతున్నా…

అనుకున్నా కానీ…

ఫీమేల్ సెంట్రిక్ సినిమా అనగానే ఎగ్జైటెడ్ అయ్యాను కానీ కొన్ని సందర్భాల్లో చాలా స్ట్రెస్ ఫీలయ్యాను. కంప్లీట్ కథ మొత్తం నా క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. దానికి తోడు ఈ క్యారెక్టర్ లో స్ట్రగుల్.. ఫైట్… కోపం లాంటి చాలా ఎమోషన్స్ ఉంటాయి.

అలా తప్పకుండా ఉండాలి…

సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే.. నెక్స్ట్ ఏంటనేది గెస్ చేయకుండా ఉండాలి. నాకీ కథలో ఆ ఎలిమెంట్ కనిపించింది. కథ వింటున్నపుడే నేను క్లైమాక్స్ గెస్ చేయడానికి ట్రై చేశా… కానీ అలా కాకుండా కథ చాలా డిఫెరెంట్ గా క్లోజవుతుంది. నాకు వినగానే సర్ ప్రైజింగ్ అనిపించింది. రేపు ఆడియెన్స్ కి కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది.

నేనెప్పుడూ హాటే…

నేను తెలుగమ్మాయిని అయ్యేసరికి చాలా వరకు నాకు స్టీరియోటైప్ క్యారెక్టర్సే వచ్చాయి… గ్లామరస్ అనిపించుకునే అవకాశం దొరకలేదు. కానీ ఈ సినిమాలో నేను చాలా గ్లామరస్ గా కనిపిస్తాను. బేసిగ్గా నేనెప్పుడూ హాటే.. ఈ సినిమాలో ఎలివేట్ అయింది అంతే…

ఫస్ట్ టైమ్ అయినా… 

డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇలాంటి థ్రిల్లర్ చేయడం ఫస్ట్ టైమ్. అయినా ఆయన ప్రతి సీన్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. పర్టికులర్ గా క్యారెక్టర్స్ విషయంలో… ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలన్నది ముందే ఖచ్చితంగా ఫిక్సయ్యారు…

స్టార్ హీరోల సరసన…

‘అరవింద సమేత’ తప్ప ఇప్పటి వరకు ఆ స్థాయి హీరో సినిమాలో చేయలేదు. అలాంటి అవకాశాలు వచ్చినా ఒకవేళ నాకు క్యారెక్టర్ నచ్చక నో చెప్పిన సందర్భాలు ఉన్నాయి…

అవి కంపల్సరీ…  

ఓ సినిమాకి ఓకె చెప్పాలంటే ముందు ఖచ్చితంగా కథకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా.. ఆ తరవాత డైరెక్టర్ కి. కొత్తవాళ్ళైనా సమస్య లేదు కానీ, ఖచ్చితంగా ఆ సినిమాని ఎలా ప్రెజెంట్ చేస్తారనే క్లారిటీ ఉండాలి.. అలా అనిపిస్తేనే ఓకె చెప్తా… 

హ్యాపీ అనిపించింది…

శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను నయనతారతో పోల్చినందుకు చాలా హ్యాపీ గా అనిపించింది. 

 

చాలా కష్టపడ్డాం…

‘రాగల 24 గంటల్లో.’ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం… ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని.. అందరికీ మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నా…