ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్

Tuesday,May 22,2018 - 12:04 by Z_CLU

ప్రస్తుతం త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో అరవింద సమేత అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో యంగ్ టైగర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె పేరు ఈషా రెబ్బ. అమీతుమీ, ‘అ!’ సినిమాలతో పాపులర్ అయిన ఈ బ్యూటీని లేటెస్ట్ గా ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారట.

త్రివిక్రమ్ సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ కామన్. అజ్ఞాతవాసిలో అను ఎమ్మాన్యుయేల్, సన్నాఫ్ సత్యమూర్తిలో నిత్యామీనన్, జల్సాలో పార్వతి మెల్టన్, అ..ఆ లో అనుపమ పరమేశ్వరన్ సెకెండ్ హీరోయిన్స్ గా నటించారు. వాళ్లందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అరవింద సమేత చిత్రంతో నటిగా మరో స్టెప్ పైకి వెళ్తాననే నమ్మకంతో ఉంది ఈషా.

ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ మాస్ లుక్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను, హీరోహీరోయిన్లతో మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.