'ఈషా రెబ్బ' ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ

Thursday,December 06,2018 - 06:02 by Z_CLU

వరుస ఆఫర్స్ అందుకుంటూ ‘తెలుగమ్మాయి’ ట్యాగ్ తో దూసుకెళ్తున్న ఈషా రెబ్బ ‘సుబ్రహ్మణ్యపురం’ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతోంది. సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రేపే థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా ఈషా ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడింది. ఆ విశేషాలు ఈషా మాటల్లోనే…

 

కొత్త అనుభూతి

థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం… ఈ జోనర్ లో సినిమా చేయడం ఇదే మొదటి సారి. కొత్త అనుభూతి కలిగింది. థ్రిల్లర్ అనేసరికి అక్కడ ఏం లేకపోయినా ఉన్నట్టు ఫీలవ్వాలి తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఆడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా అనిపించాలి. అందుకే ప్రతీ సీన్ లో కాస్త జాగ్రత్తగా బ్యాలెన్స్ గా నటించా.

 

కంప్లీట్ ఆపోజిట్

సినిమాలో నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. ఈ టైప్ క్యారెక్టర్ చేయడం నాకు కొత్త. సుమంత్ క్యారెక్టర్ కి కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ నాది. సుమంత్ దేవుణ్ణి నమ్మని హేతువాదిలా కనిపిస్తే నేను మహా భక్తురాలిగా కనిపిస్తాను. సో ఇద్దరం ఎలా కలిసాం.. ఎలా దగ్గరయ్యాం అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

 

కథ వినగానే…

డైరెక్టర్ సంతోష్ గారు నన్ను డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యారు. ఆయన తన డీటెయిల్స్ తో నాకో మెయిల్ పెట్టారు. మెయిల్ చూసి సంతోష్ గారికి కాల్ చేసి ఈ కథ విన్నాను. కథ వినగానే ఈ క్యారెక్టర్ చేయాలని డిసైడ్ అయిపోయా.

 

డైరెక్టర్ సినిమా …

నిజానికి ‘సుబ్రహ్మణ్యపురం’ డైరెక్టర్ సినిమా అని చెప్పొచ్చు…సినిమా చూసాక ముందు డైరెక్టరే కనిపిస్తాడు. సంతోష్ గారు ప్రతీ ఎలిమెంట్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. ప్రతీ సీన్ ను పర్ఫెక్ట్ గా చెప్తూ తనకి కావాల్సిన అవుట్ పుట్ తీసుకునేవారు. ఆయన ఎప్పుడూ డెబ్యూ డైరెక్టర్ గా కనిపించలేదు. ముఖ్యంగా ఆయన కథ -స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి.

 

ప్రతీ సీన్ హైలైట్…

నేను కనిపించిన ప్రతీ సీన్ హైలైట్ గా ఉంటుంది. నాకు సుమంత్ కి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి.

 

సంబరపడిపోతుంటా….

తెలుగమ్మాయి అనే ట్యాగ్ బాగా ఇష్టపడతాను. సోషల్ మీడియాలో కూడా అందరూ అలాగే మెన్షన్ చేస్తుంటారు. అలా ఎవరు పిలిచినా సంబరపడిపోతుంటా. నిజానికి నాకున్న ప్లస్ పాయింట్ అదే.

 

సుమంత్ గారితో ….

సుమంత్ గారు ఎక్స్ పీరియన్స్ యాక్టర్… ఆయన స్టోరీస్ సెలెక్షన్ బాగుంటుంది. ఈ సినిమాకి సుమంత్ గారు హీరో అనగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. గోదావరి , మళ్ళీ రావా సినిమాలు ఇష్టం. స్టార్టింగ్ లో ఎక్కువగా మాట్లాడలేదు. చాలా కాం గా ఉండేవారు. ఆ తర్వాత ఫ్రెండ్లీ గా ఉండేవారు.

 

అవి కామన్

హిట్స్ , ఫ్లాప్స్ అనేవి కామనే..కాని కొన్ని ఊహించని సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు కాస్త బాధ పడుతుంటా. సినిమా బాగుంది కదా ఆడియన్స్ కి ఎందుకు నచ్చలేదా అని అనాలసీస్ చేసుకుంటా. సినిమా నచ్చితే హ్యాపీ గా ఫీలవుతా …లేదంటే మంచి ఎక్స్ పీరియన్స్ అనుకుంటా.

 

అన్ని ట్రై చేయాలి..

ఫస్ట్ సినిమాలో ఇండిపెండెంట్ అమ్మాయిలా కాం గా కనిపించా…’అమీ తుమి’ లో కొంచెం తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ కొంచెం రౌడీ క్యారెక్టర్ చేసా. అ! లో లెస్బియన్ గా నటించా.. అలా నేను నటించే ప్రతీ క్యారెక్టర్ కొత్తగా డిఫరెంట్ గా ఉండాలని ఫీలవుతుంటా. డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలని ఉంది.

 

త్రివిక్రమ్ గారు చెప్పగానే

త్రివిక్రమ్ గారి సినిమాలంటే చాలా ఇష్టం.. ఆయన సినిమాల్లో పంచ్ లు, ప్రాసల తో కూడిన డైలాగ్స్ బాగుంటాయి. ఆయన నా సినిమాలో ఓ రోల్ ఉంది చేస్తారా.. అని అడగ్గానే ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఓకే అనేశా.. నా ప్రీవియస్ మూవీస్ గురించి అందులో నా క్యారెక్టర్ గురించి చాలా సేపు మాట్లాడారు. అలా త్రివిక్రమ్ – తారక్ గారి సినిమాలో ఒక పార్ట్ అయ్యాను.

 

మూడు సినిమాలు….

ఒక తమిళ్ సినిమా , కన్నడ సినిమాతో పాటు తెలుగులో నాగ శౌర్య తో ఓ సినిమా చేస్తున్నా.. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. తెలుగులో ఇంకా కొన్ని కథలు వింటున్నా.