Interview - తమ్మిరాజు (ఎడిటర్) F3

Wednesday,May 04,2022 - 12:44 by Z_CLU

Editor Thammiraju interview about ‘F3’ Movie

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు… సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్ బస్టర్  ‘F2’ ఫ్రాంచైజీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 27న ప్రపంచవ్యాప్తంగా  విడుదలకు సిద్ధమైమౌతుంది. తాజాగా ఈ సినిమాకి పని చేసిన స్టార్ ఎడిటర్ తమ్మిరాజు మీడియాతో ముచ్చటించారు. తమ్మిరాజు పంచుకున్న ‘ఎఫ్ 3’ విశేషాలు ఆయన మాటల్లోనే..

ఎడిటర్ గా 30సినిమాలకు

నేను పరిశ్రమలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 1998లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఆవిడ్ ఎడిటర్ గా కెరీర్ మొదలుపెట్టాను. తర్వాత  ప్రసాద్ ల్యాబ్ లో 14ఏళ్ల పాటు ఆవిడ్ ఎడిటర్ గా చేశాను. దర్శకుడు రాజమౌళి గారితో 18 ఏళ్ళు ప్రయాణం చేశాను. శాంతి నివాసం సీరియల్ నుంచి బాహుబలి 2 వరకూ రాజమౌళిగారితో పని చేశాను. దర్శకుడు అనిల్ రావిపూడిగారి తో పటాస్ నా ఫస్ట్ మూవీ. తర్వాత ఆయన సినిమాలన్నీ చేశాను.  ఇప్పటివరకూ దాదాపు 30సినిమాలకు ఎడిటర్ గా చేశాను.

ఎఫ్ 3లో ఆ పాయింట్ ఫన్ ఫుల్ గా

ఎఫ్ 2లో పెళ్లి, తర్వాత వచ్చే కష్టాలు .. ఇలా వినోదాత్మకంగా చూపించాం. ఎఫ్ 3డబ్బు చుట్టూ తిగిరే కథ. మానవసంబంధాలు డబ్బుతో ముడిపడి వున్నాయి. ఈ పాయింట్  ఎఫ్ 3లో చాలా ఫన్ ఫుల్ గా చూపించడం జరిగింది.

f3 movie venkatesh varun tej

కథ మాత్రం పూర్తిగా భిన్నం

ఎఫ్ 2 ఫ్రాంచైజ్ గా వస్తున్న సినిమా ఎఫ్ 3. ఎఫ్ 2 క్యారెక్టర్లు ఉంటాయి కానీ ఎఫ్ 3 కథ మాత్రం పూర్తిగా భిన్నం. లీడ్ క్యారెక్టర్లు తీసుకొని కథని కొత్తగా చెప్పాం.

ఏది అవసరమో అదే వుంచుతాం

కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా అనిల్ రావిపూడి గారి సినిమాల్లో అన్నీ కామెడీ పంచులు బావుంటాయి. దానిలో ఏది ట్రిమ్ చేయలన్నా కష్టంగా వుంటుంది. ఐతే ఓవరాల్ ఫ్లో చూసుకొని కథకు ఏది అవసరమో అదే వుంచుతాం.

 

పటాస్ సినిమా నుంచి

అనిల్ రావిపూడిగారితో వర్క్ చేయడం చాలా పాజిటివ్ గా వుంటుంది. ఆయన ఎప్పుడూ ప్రేక్షకుల పక్షమే ఆలోచిస్తుంటారు. పటాస్ సినిమా నుంచి మా మధ్య అద్భుతమైన సింక్ కుదిరింది.

సూచనలని దర్శకులు గౌరవిస్తారు

ఎడిటింగ్ టేబుల్ దగ్గర చాలా చర్చలు , అర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ప్రీ ప్రొడక్షన్ ఎంత చక్కగా చేస్తామో పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ కూడా అంతే జాగ్రత్తగా చేస్తే మంచి సినిమా వస్తుంది. రషస్ మొదట ఎడిటర్ చూస్తాడు. ఎడిటర్ చెప్పే సూచనలని దర్శకులు గౌరవిస్తారు.

venkatesh-and-varun-tej-F3-TRAILER-Launch-details-zeecinemalu

ప్రేక్షకులకు డబుల్ ఫన్

‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’ డబుల్ ఫన్. ఇందులో డబ్బు గురించి చెప్పే కొన్ని పాయింట్లు చాలా అద్భుతంగా వుంటాయి. ప్రేక్షకులకు డబుల్ ఫన్ అందిస్తాయి.

అనిల్ గారే కరెక్షన్స్ చూసుకుంటారు

దిల్ రాజు గారు అద్భుతమైన నిర్మాత. సినిమా అంటే ఆయనకి ప్రేమ. సినిమాని చాలా జాగ్రత్తగా చూస్తారు. అయితే దిల్ రాజు గారి బ్యానర్ లో దర్శకుడు అనిల్ రావిపూడి ఎక్కువగా పని చేయడంతో అనిల్ గారే కరెక్షన్స్ చూసుకుంటారు.

‘బాహుబలి 2’కి చేశా

నేను ‘బాహుబలి 2’కి చేశా. రాజమౌళి గారు క్రెడిట్ ఇచ్చారు. అన్ని భాషలు తెలిసిన ఎడిటర్ అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తారు.

అప్పుడు నిర్ణయం తీసుకుంటారు

దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ .. అందరూ కూర్చుని చర్చించిన తర్వాత ఏది అవసరమో, కాదో నిర్ణయం తీసుకుంటారు.

రష్ ప్రకారం ఎడిటింగ్ చేస్తా

నేను కథ వినను. కథ వింటే ఇలా వుంటుందని ఫిక్స్ అయిపోతాం. రష్ లో అది లేకపోతే ఇలా ఎందుకైయిందనే ప్రశ్న తలెత్తుతుంది. నా వరకూ రష్ ప్రకారం ఎడిటింగ్ చేస్తా.

 ఫన్ రైడ్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది

రష్ చూశాక సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనిపించింది. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు .. మిగతా నటీనటులంతా చాలా వండర్ ఫుల్ గా చేశారు. ‘ఎఫ్ 3’ ఫన్ రైడ్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది.

నెక్స్ట్ ఇవే 

కళ్యాణ్ రామ్ గారితో బింబిసార, మైత్రి మూవీ మేకర్స్ సినిమా, నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాలు చేస్తున్నా.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics