సక్సెస్ బాటలో జీ మ్యూజిక్

Thursday,December 29,2016 - 11:58 by Z_CLU

2016 జీ మ్యూజిక్ హిస్టరీ లో కొత్త మైల్ స్టోన్స్ నే రీచ్ అయింది. సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘బార్ బార్ దేఖో’ సినిమా లోని ‘కాలా చష్మా’ సాంగ్ కేవలం 24 గంటల్లో 4.3 మిలియన్ వ్యూస్ ని రీచ్ అయితే, అమీర్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘దంగల్’ సినిమాలోని ధాకడ్ 24 గంటల్లో ఏకంగా 6.3 మిలియన్ వ్యూస్ ని దారి సరికొత్త రికార్డుని సృష్టించింది. అలాగని ‘ధాకడ్’ ఇంకా స్లో పేజ్ లోకి ఎంటర్ కూడా అవ్వలేదు అప్పుడే షారుక్ ఖాన్ ‘రయీస్’ సినిమాలోని ‘లైలా మై లైలా’ బరిలోకి దిగి ఏకంగా 14 మిలియన్ వ్యూస్ దాటి, దంగల్ క్రియేట్ చేసిన రికార్డును కూడా తిరగ రాసేసింది.

నిజానికి 2016 బిగినింగ్ లోనే జీ మ్యూజిక్ సక్సెస్ బాటలో పడింది. ఈ ఇయర్ లో రిలీజైన ‘ఉడ్తా పంజాబ్’ మ్యూజిక్ కి వచ్చిన రెస్పాన్స్ తో ఏకంగా ఆపిల్ మ్యూజిక్ నుండి కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తరవాత వచ్చిన ‘రుస్తం’ సినిమాలోని ‘తేరే సంగ్ యారా’ పాట అయితే బాలీవుడ్ కి రొమాంటిక్ ఆంథం లా మారిపోయింది.

యూ ట్యూబ్ లో ఇప్పటికీ రూల్ చేస్తున్న ‘కాలా చష్మా’ అదే స్పీడ్ తో 150 + మిలియన్స్ వ్యూస్ దిశగా దూసుకుపోతుంది. దాంతో పాటు అమీర్ ఖాన్ దంగల్, షారుక్ ఖాన్ రయీస్ కూడా నంబర్స్ ని వేగంగా పెంచుకునే పనిలోనే ఉంది. 2016 క్రియేట్ చేసిన ఈ ఇంపాక్ట్ తో జీ మ్యూజిక్ కంపనీ బాలీవుడ్ కంటెంట్ తో వరల్డ్ వైడ్ లీడర్ గా గుర్తింపు సాధించడంలో సక్సెస్ అయింది.