'ద్వార‌క‌` టీజ‌ర్‌ ఆవిష్కరణ ..

Friday,August 26,2016 - 10:10 by Z_CLU

 

సూప‌ర్‌గుడ్ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో లెజెండ్ సినిమా ప‌తాకంపై ప్ర‌ద్యుమ్న‌- గ‌ణేష్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ద్వార‌క‌`. `పెళ్లిచూపులు` ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడు. పూజా జ‌వేరి క‌థానాయిక‌. శ్రీ‌నివాస్ ర‌వీంద్ర (ఎంఎస్ఆర్‌) ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం వ‌చ్చే నెల‌లో రిలీజ్ కానుంది. కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా.. స‌మ‌ర్ప‌కుడు ఆర్‌.బి.చౌద‌రి ఈ సినిమాకు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్, సాంగ్ (భ‌జ‌రే నంద‌గోపాల హ‌రే..) టీజ‌ర్‌ని ఆవిష్కరించారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ““ఇది మా బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న 89వ సినిమా. ఎంతోమంది న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, టెక్నీషియ‌న్ల‌ను ప‌రిచ‌యం చేయడం జరిగింది. అదే కోవ‌లో ఈ సినిమాతో కొత్త నిర్మాత‌లు ప్ర‌ద్యుమ్న‌-గ‌ణేష్‌, దర్శకుడిని ప‌రిచ‌యం చేయ‌డం సంతోషంగా ఉంది. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాలు నిర్మించాం. అలాగే శ్రీ‌నివాస్ ర‌వీంద‌ర్ లాంటి ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయ‌డం హ్యాపీగా ఉంది. సాయికార్తిక్ అంద‌మైన సంగీతం అందించాడు. ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. వ‌చ్చే నెల‌లో సినిమా రిలీజ్ చేయ‌నున్నాం“ అన్నారు.

నిర్మాత ప్ర‌ద్యుమ్న‌ మాట్లాడుతూ -“20 ఏళ్ల క్రితం ప్యాష‌న్‌తో సినీప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చాను. ల‌క్కీగా ఆర్‌.బి.చౌద‌రి వంటివారి అండ ల‌భించింది. . సినిమా అనేది సామాజిక బాధ్య‌త‌. విజ్ఞానంతో తీయాలి. నిర్మాత‌ల‌కు ఆ తెలివితేట‌లు. 90 సినిమాలు తీసిన నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి గారు మా వెన్నంటి నిల‌వ‌డం నా అదృష్టం. ఆయ‌న మాపై పెద్ద బాధ్య‌త ఉంచారు. 24 శాఖ‌ల‌కు సంబంధించిన కుటుంబాలు ప‌రిచయం కావ‌డం ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా క‌థ‌ని న‌మ్మి హీరో ఓకే చెప్పారు. ఈ సినిమాకి స‌పోర్టు చేసిన అంద‌రికీ పేరు పేరునా వంద‌నాలు“ అన్నారు.

ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మాట్లాడుతూ -“2015లో ఈ సినిమాకి క‌మిట‌య్యాను. క‌థ విష‌యంలో ఆర్‌.బి.చౌద‌రి గారిని క‌న్విన్స్ చేయ‌డం అంత ఈజీ కాదు. ఆయ‌న్ను ఒప్పించి ఈ సినిమా పూర్తి చేయ‌గ‌లిగాను. తెర‌పై విజువ‌ల్స్ చూసి ఆశీర్వ‌దించండి“ అన్నారు.

మాట‌ల ర‌చ‌యిత ల‌క్ష్మీ భూపాల్ మాట్లాడుతూ -“టాప్ టెక్నీషియ‌న్ల‌తో, ఆర్‌.బి.చౌద‌రి గారి అండ‌తో తీసిన సినిమాకి ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంది.పెళ్లి చూపులు హీరో హిట్‌తో ఊపుమీదున్నాడు. ఈ సినిమాతో మ‌రో పెద్ద విజ‌యం అందుకోవాలి“ అన్నారు.

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ -“పెళ్లి చూపులు విజ‌యంతో క్ష‌ణం తీరిక లేకుండా అయిపోయాను. ఆ విజ‌యాన్ని ఆస్వాధిస్తుండ‌గానే `ద్వ‌రాక‌` వ‌చ్చేస్తోంది. అంద‌రూ టాప్ టెక్నీషియ‌న్ల‌తో, ఆర్‌.బి.చౌద‌రి గారి బ్యాన‌ర్‌లో సినిమా అంటే షాక్‌కి గుర‌య్యాను. మెగా నిర్మాత‌ల్ని నా ఖాతాలో వేసుకున్నానా? అనిపించింది. ద్వార‌క క‌థ న‌చ్చి ఓకే చెప్పాను. వైవిధ్యం ఉన్న క‌థ‌ని నిర్మాత‌లు ఎంక‌రేజ్ చేయ‌డం హ్యాపీ. గ‌ణేష్ కొరియోగ్ర‌ఫీలో వైవిధ్య‌మైన డ్యాన్సులు వేశాను“ అన్నారు.

నిర్మాత గ‌ణేష్‌, శ్యామ్‌.కె.నాయుడు, మాజీ ఇన్‌కంట్యాక్స్ క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థి, సాయికార్తిక్‌, బ్ర‌హ్మ‌క‌డ‌లి, పూజా జ‌వేరి, పి.హ‌రికృష్ణ‌, గిరిధ‌ర్ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు