

Wednesday,March 16,2022 - 04:06 by Z_CLU
Duniya Vijay As Musali Madugu Pratap Reddy In Balakrishna, Gopichand Malineni’s #NBK107
ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్ ని పరిచయం చేస్తూ, ఈ చిత్రం నుండి అతని ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. సిగరెట్ తాగుతూ పోస్టర్లో రఫ్ గానూ సీరియస్ లుక్ లో కనిపించాడు. ఆయన గెటప్ తో సినిమాలో ఆయన నటిస్తున్న పవర్ ఫుల్ రోల్ ను తెలియజేస్తుంది. దునియా విజయ్ ఇప్పటికే షూట్ లో జాయిన్ అయ్యాడు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని చిత్రాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిని కలిగి ఉంటాయి.అందుకే NBK 107 కోసం కొంతమంది అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.
ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. రామ్-లక్ష్మణ్ ద్వయం ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్న ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
Sunday,August 14,2022 03:32 by Z_CLU
Sunday,August 14,2022 12:31 by Z_CLU
Friday,August 12,2022 03:47 by Z_CLU
Friday,August 12,2022 03:17 by Z_CLU