Dulquer Salman కురుప్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Wednesday,September 28,2022 - 05:09 by Z_CLU

Dulquer Salman’s ‘KURUP’ World Television Premiere on September 30th at 6PM

దుల్కర్ సల్మాన్ హీరోగా శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కి థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించిన ‘కురుప్’ ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఆసక్తికరమైన కథతో క్రైం యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జీ సినిమాలు ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ శుక్రవారం ( సెప్టెంబర్ 30) టెలికాస్ట్ అవ్వనుంది.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దేశవ్యాప్తంగా మార్మోగిన కురుప్ అతని వాస్తవ జీవిత నేర కథతో తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగా నడుస్తుంది. కురుప్ ఎవరు? కురుప్ ని పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? అసలు కురుప్ చేసిన నేరం ఏంటి ? ఇవన్నీ తెలుసుకోవాలంటే కచ్చితంగా జీ సినిమాలు లో టెలికాస్ట్ అయ్యే కురుప్ సినిమా చూడాల్సిందే. దుల్కర్ సల్మాన్ నటన ,  యాక్షన్ ఎలిమెంట్స్ , క్రైం బ్యాక్ డ్రాప్ డ్రామా , యాక్షన్ సీక్వెన్స్ లు ఇలా అన్నీ అలరిస్తాయి.

 Watch World Television Premiere #Kurup This Friday at 6 PM on ZeeCinemalu