మహానటిలో జెమినీ గణేషన్ లుక్ రిలీజయింది

Friday,July 28,2017 - 02:47 by Z_CLU

మహానటి సావిత్రి సినిమాలో సావిత్రి క్యారెక్టర్ లో కీర్తి సురేష్, జెమినీ గణేషన్ రోల్ లో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. అయితే ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్ దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా దుల్కర్ లుక్ ని ఈ రోజే  రిలీజ్ చేసింది. బ్లాక్ & వైట్ కాన్వాస్ పై జెమినీ గణేషన్ లుక్స్ లో ఉన్న దుల్కర్ సల్మాన్ అందరినీ ఇంప్రెస్ చేసేశాడు.

 

సమంతా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా కోసం చాలా రోజులుగా… మహానటి సావిత్రి పై రీసర్చ్ చేసిన సినిమా యూనిట్, సావిత్రి లైఫ్ లోని ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ని తెరకెక్కించే పనిలో ఉంది. విజయ్ దేవరకొండ కూడా ఓ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ డైరెక్టర్.