'సావిత్రి' లో మలయాళ హీరో ...

Monday,April 24,2017 - 03:00 by Z_CLU

సావిత్రి జీవిత కథతో ‘మహానటి’ టైటిల్ తో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్  పై రూపొందనున్న ఈ సినిమాలో సావిత్రి గా కీర్తి సురేష్  నటించనుండగా సమంత మరో ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.. అయితే నిన్నటి వరకూ ఈ సినిమాలోని ఇంపార్టెంట్ రోల్ అయిన సావిత్రి భర్త జెమినీ గణేశన్ రోల్ ఎవరు చేస్తారా..? అనే క్వశ్చన్ కి ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్..

మొన్నటివరకూ ఈ ఇంపార్టెంట్ రోల్ కి ప్రకాష్ రాజ్ ను అనుకుంటున్నారనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొట్టగా లేటెస్ట్ గా ఆ రోల్ కి మలయాళ యూత్ స్టార్ దుల్కర్ సల్మాన్ ను ఫైనల్ చేశారు. ఇప్పటికే ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన దుల్కర్ ఈ రోల్ లో ఎలా కనిపిస్తాడో చూడాలి.

సావిత్రి పాత్రను కీర్తిసురేష్ పోషిస్తుండగా, సినిమాలో జర్నలిస్ట్ పాత్రను సమంత  పోషించనుంది. మరో కీలక పాత్ర కోసం అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నారట. సినిమాలో కీలకమైన జమున పాత్ర కోసం అనుష్కను సంప్రదించినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా.. మే 10 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.