Mega 154 డబ్బింగ్ పనులు మొదలు

Friday,October 14,2022 - 03:09 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజా రవితేజ ఫుల్లెంగ్త్ రోల్ లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ Mega154. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. తాజాగా దర్శకుడు బాబీ అండ్ టీం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు  మొదలు పెట్టారు.

హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన సెట్స్ లో ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. మెగా పూనకాలు లోడింగ్ అంటూ దర్శకుడు బాబీ ఈ సినిమాపై మెగా అభిమానుల్లో అలాగే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ కల్లా అన్ని పనులు పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఖైదీ నంబర్ 150 తర్వాత మళ్ళీ చిరు – దేవి కాంబో లో రాబోతున్న ఈ ఆల్బం పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. దీపావళి కి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ టైటిల్ ను త్వరలోనే ఎనౌన్స్ చేయబోతున్నారు.