టాలీవుడ్ లో డబ్బింగ్ హంగామా

Saturday,December 03,2016 - 01:30 by Z_CLU

నెలకో 2-3 డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ లో సందడి చేయడం సహజమే. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడానికి ఈ డబ్బింగ్ సినిమాలు నిర్మాతలకు బాగా హెల్ప్ అవుతాయి. అందుకే ఇతర భాషల నుండి సూపర్ హిట్ సినిమాల రైట్స్ కొని మరీ టాలీవుడ్ లో రిలీజ్ చేస్తుంటారు మన నిర్మాతలు.

remo-movie
మొన్నటి వరకూ శివకార్తికేయన్ నటించిన ‘రెమో’ సినిమా టాలీవుడ్ లో  కాస్త సందడి చేయగా ఈవారం మరో రెండు డబ్బింగ్ సినిమాలు  సందడి చేస్తున్నాయి. వాటిలో ఒకటి విజయ్ ఆంటోనీ నటించిన ‘భేతాళుడు’ కాగా, ఇంకోటి మోహన్ లాల్ నటించిన ‘మన్యం పులి’. ఈ వారం బడా సినిమాలు లేకపోవడం ధృవ రిలీజ్ కి వారం గ్యాప్ ఉండడంతో…ప్రస్తుతం బరిలో ఈ రెండే ఉన్నాయి.

ఈ శుక్రవారం రిలీజ్ అయిన  ‘భేతాళుడు’ బాగుంది అనే టాక్ తెచ్చుకోగా… ‘మన్యం పులి’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వారం బడా సినిమాలు లేకపోవడం తో తెలుగు ప్రేక్షకులకు ఈ డబ్బింగ్ సినిమాలే కనిపిస్తున్నాయి. మరి రిలీజ్ రోజే హిట్ టాక్ అందుకున్న ఈ సినిమాలు కలెక్షన్స్ పరంగా ఎలాంటి విజయం అందుకుంటాయో? చూడాలి..