Dhamaka డు డు సాంగ్ రిలీజ్

Saturday,November 26,2022 - 03:25 by Z_CLU

 Du Du Song From Mass Maharaja Ravi Teja’s “DHAMAKA” Unleashed

మాస్ మహారాజా రవితేజ (Ravi teja), త్రినాథరావు నక్కిన కాంబోలో వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ‘ధమాకా’ (Dhamaka) నుండి తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో ఈ పాటని మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఎక్స్ టార్డినరీ మాస్ నెంబర్ గా కంపోజ్ చేశారు.  ఈ పాటలో రవితేజ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్, స్వాగ్ మైండ్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ రోల్ ని తెలియజేస్తోంది. ఈ పాటని పృధ్వీ చంద్ర ఫెంటాస్టిక్ గా ఆలపించారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.

డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics